Ujjwala Yojana Subsidy 2025: కేంద్ర ప్రభుత్వం దేశంలోని పేద ప్రజలకు శుభవార్తను తెలియజేసింది, కేంద్ర ప్రభుత్వం ఉజ్వల్ యోజన పధకం ద్వారా పేద ప్రజలకు గ్యాస్ సిలిండర్ లో సబ్సిడీ ఇస్తున్న విషయం అందరికి తెలిసిన మాటే, అయితే ఈ పధకం యొక్క ఉద్దేశం ఏమిటి, ఇది ఎవరికి వర్తిస్తుంది, ఈ పధకం పొందాలి అంటే ఏ అర్హతలు ఉండాలి, ఎలా అప్లై చేస్కోవాలి అనే విషయాన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ పధకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పెద్ద ప్రజలకు ఖర్చు తగ్గించే విధంగా సహాయం చేయడం. అదేవిధముగా వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడటం, పర్యావరణానికి మేలు జరిగే విధంగా చేయడం. గ్యాస్ సిలిండర్ కొనుక్కోవడానికి ఆర్ధిక భారముగా అనిపించే పేద ప్రజలు వంట చెరకుని ఉపయోగించి వంట చేస్తుంటారు దానివలన వారికి ఆరోగ్యపరమైన సమస్యలు రావటమే కాక కట్టెలు మండించడం వలన వెలువాడె పొగ కారణంగా పర్యావరణం కూడా కలుషితం అవ్వుతుంది.
ఈ సమస్యని తగ్గించడానికి మరియు పేద వారికి సహాయంగా నిలవడానికి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. దీని వలన పేద మహిళలు లబ్ది పొందటం జరుగుతుంది. ఈ పధకం ద్వారా కేంద్ర ప్రభుత్వం సీలిండర్ పై 300 రూపాయలు సబ్సిడి ఇస్తుంది, అప్పుడు గ్యాస్ సిలిండర్ 553 రూపాయలకు మాత్రమే రావడం జరుగుతుంది. ఈ సబ్సిడి డబ్బులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈ సబ్సిడీని కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.12,000 కోట్లు కేటాయించింది. దీంతో 10.27 కోట్ల కుటుంబాలకు లబ్ధి కలుగుతోంది.
ఈ పధకానికి కావలసిన అర్హతలు
- దరఖాస్తుదారు కనీసం 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల మహిళ అయి ఉండాలి.
- భారతదేశ పౌరురాలై ఉండాలి.
- BPL (బిలో పావర్టీ లైన్) కుటుంబానికి చెందాలి.
- ఆధార్ కార్డు తప్పనిసరి.
- ఒక్క కుటుంబానికి ఒకే LPG కనెక్షన్ లభిస్తుంది.
- ఇప్పటికే LPG కనెక్షన్ ఉన్నవారు అర్హులు కావు.
- SC, ST, OBC, అంత్యోదయ కుటుంబాలకు ప్రాధాన్యం ఉంటుంది.
- 2024 అప్‌డేట్ ప్రకారం, పారిశ్రామిక ఆదాయం రూ.10 లక్షల లోపు ఉండాలి.
ఆన్లైన్ లో ఎలా అప్లై చేస్కోవాలి
- అధికారిక వెబ్‌సైట్ www.pmuy.gov.inలోకి వెళ్లాలి.
- అక్కడ ‘Apply Now’ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
- ఆధార్ నంబర్ మరియు మొబైల్ నంబర్ ఉపయోగించి లాగిన్ కావాలి.
- అప్లికేషన్ ఫారమ్‌లో పేరు, చిరునామా, బ్యాంక్ ఖాతా వివరాలు నమోదు చేయాలి.
- ఆధార్ కార్డ్, BPL కార్డ్, ఫొటో వంటి అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.
- వెరిఫికేషన్ పూర్తైన తర్వాత 15 నుండి 30 రోజుల్లో LPG కనెక్షన్ జారీ అవుతుంది.
- మీరు ఇండియన్ ఆయిల్, హెచ్‌పీ గ్యాస్, భారత్ గ్యాస్ అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా కూడా దరఖాస్తు చేయవచ్చు.
ఆఫ్‌లైన్ లో ఎలా అప్లై చేస్కోవాలి
- సమీప గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి అప్లికేషన్ ఫారమ్‌ను తీసుకోవాలి.
- ఫారమ్‌తో పాటు క్రింద పేర్కొన్న డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలను జతచేయాలి:
- ఆధార్ కార్డ్
- BPL కార్డ్
- చిరునామా రుజువు (అడ్రస్ ప్రూఫ్)
- పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో
- బ్యాంక్ పాస్‌బుక్
- ఈ ఫారమ్‌ను పూర్తిగా నింపి ఏజెన్సీలో సమర్పించాలి.
- సంబంధిత అధికారుల ద్వారా వెరిఫికేషన్ జరగుతుంది.
- వెరిఫికేషన్ పూర్తైన తర్వాత గ్యాస్ కనెక్షన్ అందజేస్తారు.
సబ్సిడి స్టేటస్ ఎలా చెక్ చేస్కోవాలి
ఉజ్వల యోజన (Ujjwala Yojana) సబ్సిడీ స్థితిని (Status) ఆన్‌లైన్‌లో చెక్ చేయడానికి ఈ స్టెప్పులు అనుసరించాలి.
- అధికారిక వెబ్‌సైట్ www.pmuy.gov.in కి వెళ్ళాలి.
- అక్కడ ఉన్న ‘చెక్ స్టేటస్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఆధార్ నంబర్ను నమోదు చేయాలి.
- సబ్సిడీ స్థితిని ఇండియన్ ఆయిల్, హెచ్‌పీ గ్యాస్, భారత్ గ్యాస్ అధికారిక పోర్టల్స్‌లో కూడా తెలుసుకోవచ్చు.
- టోల్-ఫ్రీ నంబర్ 1800-266-6696 ద్వారా కూడా సమాచారం పొందవచ్చు.
- సబ్సిడీ స్థితిని తెలుసుకోవడానికి ఆధార్ కార్డ్ బ్యాంక్ ఖాతాకు లింక్ అయి ఉండాలి.
- సబ్సిడీ బ్యాంక్ అకౌంట్‌లో డిపాజిట్ అయిందా లేదా అనే విషయాన్ని కూడా ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు.
Official Website Link: www.pmuy.gov.in
Ujjwala Yojana Subsidy 2025 – FAQs
Women aged 18 years or above belonging to BPL families, with Aadhaar and no existing LPG connection, are eligible.
You can apply online at www.pmuy.gov.in or offline by visiting the nearest gas agency with required documents.
Visit www.pmuy.gov.in, click on ‘Check Status’, and enter your Aadhaar or registration number. You can also call the toll-free number 1800-266-6696.