18 ఏళ్లు పైబడిన మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణ – SBI ప్రత్యేక అవకాశం | SBI Free Tailoring Training

SBI Free Tailoring Training: తెలంగాణలో నివసించే రేషన్ కార్డు ఉన్న 18 ఏళ్లు పైబడిన మహిళలకి ఒక గొప్ప అవకాశం. ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా టైలరింగ్ నేర్చుకునే అవకాశాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (SBI RSETI) అందిస్తోంది. ఈ శిక్షణ పొందటానికి మీకు అర్హత ఉన్నట్లయితే ఇది మీ ఆర్ధిక స్థితిని మరింత మెరుగు పరచుకోవడానికి ఉపయోగ పడుతుంది.

ఈ శిక్షణలో ప్రత్యేకత ఏమిటంటే – 31 రోజుల పాటు పూర్తిగా ఉచితంగా శిక్షణ ఇవ్వడమే కాదు, భోజనం, వసతి, కోర్సు మెటీరియల్ వరకు అన్నీ SBI స్వయంగా అందిస్తోంది. దీని వల్ల కనీస ఖర్చు కూడా లేకుండా, ఓ నైపుణ్యాన్ని నేర్చుకునే అవకాశం లభిస్తోంది.

హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, జనగామ జిల్లాలకు చెందిన మహిళలు ఈ శిక్షణకు అర్హులు. వయస్సు 18 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉండాలి. మీకే తెలుగులో చదవడం, రాయడం వచ్చి ఉంటే చాలు. ఇంకేం కావాలి? జూన్ 9, 2025 చివరి తేదీగా ఇవ్వబడింది. అప్పటికి ముందు మీరు మీ జిల్లా కేంద్రంలోని SBI RSETI కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి.

Cheyutha Scheme Pension Hike
శుభవార్త..! చేయూత పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ.4000 | Cheyutha Scheme Pension Hike

ఈ శిక్షణ పూర్తయ్యాక అధికారిక సర్టిఫికేట్ కూడా అందుతుంది. ఇది తరువాతి ఉద్యోగ అవకాశాలకు మద్దతుగా ఉపయోగపడుతుంది లేదా మీరు స్వంతంగా బూటిక్ మొదలుపెట్టాలన్నా ఆ ధైర్యం ఇస్తుంది.

ఇలాంటి అవకాశాలు తరచూ రావు. అందుకే మీ వయస్సు 18 పైబడినట్లయితే, రేషన్ కార్డు మీ పేరు పై ఉన్నట్లయితే – ఈ అవకాశాన్ని వదులుకోకండి. మీరు లేదా మీకు తెలిసిన మహిళలు అర్హులైతే వెంటనే అప్లై చేయండి. మరిన్ని వివరాలకు 9704056522, 9849307873 నెంబర్లలో సంప్రదించవచ్చు.

SBI Free Tailoring TrainingFAQs

Do I need to apply online for this training?

No, you need to visit the RSETI office in person to apply.

Rajiv Yuva Vikasam Beneficiary List 2025
రాజీవ్ యువ వికాసం పథకం 2025 అర్హుల జాబితా విడుదల – మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేయండి | Rajiv Yuva Vikasam Beneficiary List 2025
Will there be a job after the training?

This is a skill development training that offers employment opportunities, but it does not guarantee a job. However, you can start your own self-employment.

Can women from other districts apply?

Currently, this training is available only in 6 districts.

Author: Roshan

Roshan is a content writer at bhubharati.co.in, where he contributes articles on government schemes, public services, and social awareness topics. With a background in news writing and educational content development, Roshan brings years of experience in simplifying complex policies and making information accessible to all. His work focuses on empowering readers—especially students, farmers, and rural citizens—by delivering accurate, easy-to-understand content rooted in facts and public interest.

Leave a Comment