Modified Interest Subvention Scheme (MISS)2025: తక్కువ వడ్డీతో 3లక్షలు వరకు వ్యవసాయ రుణం పొందవచ్చు , ఇది రైతులకు శుభవార్త గా భావించవచ్చు ఎందుకంటే రైతులకు తమ వ్యవసాయ అవసరాల రీత్యా పెట్టుబడి అవసరమైనపుడు రుణం కోసం ప్రయత్నించి రుణం పొందినప్పటికీ, ఆ పొందినటువంటి రుణం తక్కువ వడ్డీరేటు మరియు రాయితీ లభించడం చాల కష్టం. కాని ఈ అడ్డంకి ని అధిగమించాడనికి ఈ పధకం ఎంతగానో సహాయ పడుతుంది. రైతుల పై పెట్టుబడి భారం తగ్గించుకునేందుకు ఈ పధకం ఉపయోగపడుతుంది.

ఈ పధకం Modified Interest Subvention Scheme (MISS) ద్వారా రైతులు తక్కువ వడ్డీ రేటుకే రుణాన్ని పొందవచ్చు. అదేవిధంగా సకాలంలో ఈ రుణం మొత్తాన్ని తిరిగి చెల్లించిన వారికి వడ్డీలో రాయితి లభించడం జరుగుతుంది. ఈ వడ్డీ రాయితీ పధకాన్ని రైతులు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా పొందవచ్చు.
కిసాన్ కేడిట్ కార్డు ఎలా పొందాలి?
ఈ కింద తెలిపిన పద్ధతి ద్వారా కిసాన్ క్రెడిట్ కార్డుని సులభంగా పొందవచ్చు.
- బ్యాంక్‌కి వెళ్లాలి – దగ్గరలోని బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లి ఫారం తీసుకోవాలి.
- ఫారం పూరించాలి – అవసరమైన సమాచారం పూర్తి చేయాలి.
- పత్రాలు జతచేయాలి – ఆధార్, భూమి పత్రాలు, ఫోటోలు అందించాలి.
- ఆన్‌లైన్‌లో కూడా అప్లై చేయవచ్చు – సంబంధిత బ్యాంక్ వెబ్‌సైట్ లో అప్లికేషన్ లింక్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు.
- కార్డు జారీ – బ్యాంకులు రూపే కార్డు రూపంలో KCC ఇస్తాయి.
వడ్డీ రాయితీ రుణం పొందడానికి కావల్సిన అర్హతలు
ఈ రుణం పొందడానికి కొన్ని అర్హతలు కావాల్సి ఉంటుంది వాటిని ఈ కింద పేర్కోవటం జరిగింది.
- వయసు: 18 నుంచి 75 ఏళ్ల మధ్య ఉండాలి.
- రైతులు: భూమి కలిగి వ్యవసాయం చేస్తున్న వారు అర్హులు.
- ఇతరులు: కౌలు రైతులు, లీజుదారులు, షేర్ క్రాపర్స్, పాడి రైతులు కూడా అర్హులు.
- గుంపులు: SHGs, JLGs లాంటి గ్రూపులకు కూడా వర్తిస్తుంది.
- రుణ పరిమితి: రూ.3 లక్షల లోపు స్వల్పకాలిక వ్యవసాయ రుణాలకు మాత్రమే వర్తిస్తుంది.
అప్లై చేయు విధానం
- ప్రత్యేకంగా అప్లై చేయాల్సిన అవసరం లేదు
కిసాన్ క్రెడిట్ కార్డు లేదా వ్యవసాయ రుణానికి అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఈ పథకం వర్తిస్తుంది. - అవసరమైన పత్రాలు:
- ఆధార్, పాన్, ఓటర్ ID
- అడ్రస్ ప్రూఫ్
- భూమి యాజమాన్య పత్రాలు
- బ్యాంక్ ఖాతా వివరాలు
ఈ రుణం పొందడానికి కావాల్సిన అర్హతలు మీకూ ఉన్నవైట్లయితే వెంటనే అప్లై చేసుకొని ఈ వడ్డీ రాయితీ రుణాన్ని మీరు పొందవచ్చు.
Modified Interest Subvention Scheme – FAQs
Up to ₹3 lakhs for short-term agricultural purposes.
Farmers aged 18–75 years, including landowners, tenant farmers, leaseholders, SHGs, and JLGs.
Visit your nearest bank branch or apply online through the bank’s official website with required documents like Aadhaar, land papers, and photos.