ఈ కుకింగ్ ఆయిల్స్ మీరు వాడుతున్నారా? అయితే ప్రమాదంలో ఉన్నట్లే | Harmful Effects of Cooking Oils

Harmful Effects of Cooking Oils: ఉదయం లేచిన దగ్గరినుండి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరు మనం తినే ఆహారంలో రకరకాల వంట నూనెలు ఏదో రకంగా ఉపయోగిస్తూనే ఉంటారు. ఒక్కమాటలో చెప్పాలి అంటే వంటనూనెలు లేకుండా తయారవ్వని వంట పదార్దాలు ఉండవు మన భారత ప్రజల జీవనశైలి ప్రకారం ఎక్కువా శాతం వంటనూనెలు లేని ఆహారాలు ఉండవు. కాని మనం వాడే వంట నూనెలు కూడా మన ఆరోగ్యానికి ఎంత నష్టం కలిగీస్తాయో మీకు తెలుసా? మరి ముఖ్యంగా ఈ వంట నూనెలు వాడటం వలన ఆరోగ్యం మరింత మెరుగవ్వుతుంది అని యాడ్ లు ఇచ్చే వంట నూనెలు కూడా ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో తెలుసా? మనం వాడే నూనెలు ఆరోగ్యం పరంగా ఎటువంటి ప్రభావం చూపుతాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మన రోజువారీ జీవితంలో ఆహార తయారీలో ఉపయోగించే కొన్ని రకాల నూనెలు ఉన్నాయి అవి. పామాయిల్ నూనె, మొక్కజొన్న నూనె, పత్తి నూనె, కొబ్బరి నూనె వీటిని వీరివిగా ఆహార తయారీలలో ఎక్కువగా ఉపయోగిచడం జరుగుతుంది. ఈ నూనెలను మోతాదుకు మించి ఉపయోగించడం వలన కలిగే కొన్ని నష్టాల గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం.

పామాయిల్ వాడటం వలన కలిగే దుష్ప్రభావాలు

పామాయిల్ ను మన రోజువారీ వంటలలో ఎక్కువగా ఉపయోగిచడం జరుగుతుంది.దీని వలన ఎటువంటి ఆరోగ్య పరమయిన సమస్యలు రావనే ఉద్దేశంతో ఈ ఆయిల్ ను ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. కానీ దీని వలన కొన్ని చెడు ప్రభావాలు మన ఆరోగ్యం మీద పడే అవకాశం ఉంది.

కలిగే నష్టం: పామాయిల్ నూనెలో ఏక్కువ భాగం శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటుంది దీనివలన శరీరంలో చెడు కోలాస్ట్రాల్ శాతం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. పామాయిల్ వేడిచేయడం వలన ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువగా కలుగుతుంది. శరీరంలోని రక్త నాళాలు పలుచన అవ్వడమే కాకుండా ఆక్సిడైజ్డ్ కాంపౌండ్స్ కూడా ఉత్పత్తి అవుతాయి. ఇవి నాడీ వ్యవస్థపై, గుండెపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.

పత్తి నూనె వాడటం వలన కలిగే దుష్ప్రభావాలు

ఈ నూనెని పత్తి గింజలతో తయారు చేయడం జరుగుతుంది. ఈ నూనెను కూడా వంటలలో ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఈ నూనెను ఎక్కువగా వాడటం వలన కలిగే నష్టాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కలిగే నష్టం: ఈ నూనెలో ఒమేగా-6 పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి దీనిని ఎక్కువగా ఉపయోగించడం వలన చెడు కొవ్వు పెరిగి హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

LIC Assured Income FD Plan
నెలకు ₹10,000 అందించే LIC FD ప్లాన్ | LIC Assured Income FD Plan

కొబ్బరినూనె వలన కలిగే నష్టాలు

కొబ్బరి నూనె ఆరోగ్యానికి మంచిదని భావించి ఈ నూనెని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. అయితే ఈ నూనెని ఎక్కువగా ఉపయోగిచడం వలన కూడా కొన్ని ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

కలిగే నష్టం: కొబ్బరి నూనెలో శాచురేటెడ్ ఫ్యాట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. దీని వలన శరీరంలో చేడు కొలెస్ట్రాల్ అధికంగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. దీని వలన భవిష్యత్తులో గుండె సంభందిత జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మొక్కజొన్న నూనె వాడటం వలన వచ్చే సమస్యలు

మొక్కజొన్న నూనెని కూడా ఎక్కువగా వంటకాలలో ఉపయోగించడం జరుగుతుంది. అయితే దీని వలన కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

కలిగే నష్టం: మొక్కజొన్న నూనెలో ఒమేగా-6 కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి అధికంగా తీసుకుంటే ఇన్‌ఫ్లమేషన్‌కు కారణమవుతుంది. శుద్ధి ప్రక్రియలో హానికర రసాయనాలు ఏర్పడి, గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తాయి. ఎక్కువగా వాడితే గుండె ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది.

ఈ వంట నూనెలను ఎంత మోతాదులో ఉపయోగించాలో తేలుసుకుని ఉపయోగించడం ఉత్తమం. ఎప్పుడు ఒక రకమైన నూనెని మాత్రమే కాకుండ మారుస్తూ వివిధ రకాల నూనెలను వాడటం మూలంగా కూడా ప్రమాద శాతాన్ని తగ్గించుకోవచ్చు.

Harmful Effects of Cooking Oils – FAQs

Which cooking oil is most harmful to health?

Palm oil and cottonseed oil are considered harmful due to their high saturated fat and Omega-6 content, leading to cholesterol and heart-related problems.

Ujjwala Yojana Subsidy 2025
మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం | Ujjwala Yojana Subsidy 2025
Is coconut oil good or bad for health?

Though often viewed as healthy, excessive use of coconut oil can increase bad cholesterol due to high saturated fats.

What are the risks of overusing corn oil?

Overuse of corn oil can cause inflammation and heart issues due to its high Omega-6 fatty acids and chemical processing.

Author: Roshan

Roshan is a content writer at bhubharati.co.in, where he contributes articles on government schemes, public services, and social awareness topics. With a background in news writing and educational content development, Roshan brings years of experience in simplifying complex policies and making information accessible to all. His work focuses on empowering readers—especially students, farmers, and rural citizens—by delivering accurate, easy-to-understand content rooted in facts and public interest.

Leave a Comment