Digital Lakshmi Scheme for Women Employment in AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ తెలిపింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర మహిళలకు ఉపాధిని కలుగ జేసే విధముగా ముందడుగు వేస్తూ మరో ఉపాధి అవకాశాన్ని కల్పించనుంది. దీని ద్వారా నిరుద్యోగం కూడా తగ్గే అవకాశం ఉంది.

ఈ పధకం పేరు డిడిజిటల్ లక్ష్మి పధకం, ఈ పధకం ద్వారా ముఖ్యంగా డ్వాక్రా గ్రూపు లోని మహిళలు లబ్ధి పొందే అవకాశం ఇది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, డ్వాక్రా గ్రూపు లోని విద్యావంతులైన మహిళలకు ఉపాధిని కల్పిచడం. విద్యావంతులైన డ్వాక్రా గ్రూపు మహిళలు ఈ పధకానికి అభర్ధన చేస్కోవచ్చు.
డిడిజిటల్ లక్ష్మి పధకం యొక్క వివరాలు
అంశం | వివరణ |
---|---|
పథకం పేరు | డిజిటల్ లక్ష్మి పథకం |
లబ్ధిదారులు | డ్వాక్రా గ్రూపు లోని విద్యావంతులైన మహిళలు |
అర్హతలు | 1. డ్వాక్రా సభ్యత్వం 2. ఏదైనా డిగ్రీ పాస్ 3. కంప్యూటర్ నైపుణ్యం |
ఉపాధి విధానం | ఇంటి వద్ద నుంచే పని చేసే అవకాశం |
ప్రభుత్వ రుణం | రూ. 2 లక్షల రుణం అందుబాటులో ఉంటుంది |
పని విధానం | ప్రభుత్వ సేవల ప్రాసెసింగ్, ఫారాల పూరణ, ప్రజలకు అవగాహన కల్పించడం |
కావాల్సిన అర్హతలు
- డ్వాక్ర గ్రూపులోని సభ్యులు అయ్యి ఉండాలి.
- ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
- కంప్యూటర్ అప్లికేషన్లు వాడటం తెలిసి ఉండాలి.
ఈ జాబ్ ఎలా ఉంటుంది? దీని యొక్క ముఖ్య ఉద్దేశం మరియు పని విధానం
ఈ డిడిజిటల్ లక్ష్మి పధకంలో ఎంపిక అయ్యిన వారు పని చేసేందుకు ఎక్కడికి వెళ్లనక్కర్లేదు, ఈ జాబ్ ని ఇంటి వద్దనే ఉంది చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. దీనికి గాను ప్రభుత్వము 2లక్షల రూపాయలు రుణం కూడా అందించడానికి సిద్ధముగా ఉంది. ఈ డిజిటల్ లక్ష్మి పధకం ద్వారా ప్రభుత్వ సేవలను చేయవలసి ఉంటుంది. పింఛను దరఖాస్తులు, రేషన్ కార్డు అప్డేట్ లు ఆరోగ్య పధకాల నమోదు, విద్యకు సంభందించిన వివరాలు మరియు వివిధ ఫారాల గురించి మరియు వివిధ ప్రభుత్వ కార్యకలాపాల గురించి ప్రజలకు అవగాహనా కల్పించడం. వంటివి ఇందులో భాగంగా ఉంటాయి.