AP Schools Reopen Date 2025: ఆంధ్రప్రదేశ్‌లో విద్యా సంవత్సరం 2025-26 కి సంబంధించిన స్కూళ్ల ప్రాంభ తేదీపై ఆతృతగా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు, విద్యార్థులకు ఎంతో అవసరమైన సమాచారం వచ్చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు జూన్ 12నుండి తిరిగి ప్రారంభం కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వేసవి సెలవులు ముగియడంతో ఇక తరగతులు మళ్లీ మొదలుకాబోతున్నాయి.

ఈసారి విద్యా శాఖ ముందస్తు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యంగా పాఠ్యపుస్తకాల పంపిణీ విషయంలో ముందుగానే చర్యలు తీసుకుంది. ఇప్పటికే 80 శాతం పుస్తకాలు స్కూళ్లకు చేరగా, మిగిలినవి జూన్ 10 లోగా పూర్తిగా పంపిణీ చేయాలని నిర్ణయించారు. విద్యార్థులకు పాఠాలు ప్రారంభమయ్యే నాటికి కావాల్సిన పుస్తకాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం, మొదటి టర్మ్ జూన్ 12 నుంచి సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుంది. దసరా సెలవులు అక్టోబర్ 1 నుంచి 12 వరకు, రెండో టర్మ్ అక్టోబర్ 13 నుంచి డిసెంబర్ 23 వరకు కొనసాగుతుంది. డిసెంబర్ 24-25 క్రిస్మస్ సెలవుల అనంతరం మూడో టర్మ్ జనవరి 2 నుంచి ఏప్రిల్ 23 వరకు ఉంటుంది. అనంతరం ఏప్రిల్ 24నుండి వేసవి సెలవులు ప్రారంభమవుతాయి.
తరగతులు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయి. సోమవారం నుంచి శనివారం వరకు తరగతులు నిర్వహిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం యథావిధిగా అమలవుతుంది. అదనంగా డిజిటల్ తరగతుల కోసం ప్రత్యేక సమయం కేటాయించాలని సూచించారు.
విద్యార్థులు తల్లిదండ్రులు స్కూల్స్ తెరిచే తేదీ తెలుసుకుని, పిల్లలకు అవసరమైన సౌకర్యాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలని విద్యాశాఖ సూచిస్తోంది. పాఠశాలలు మొదలయ్యే ముందు విద్యార్థులు పూర్తిగా సిద్ధంగా ఉండేలా చూసుకోవాలని అధికారులు సూచించారు.
AP Schools Reopen Date 2025 – FAQs
All government and private schools will reopen from June 12, 2025.
Textbook distribution will be completed in all schools by June 10.
Summer holidays will begin from April 24, 2026.
Classes will be held from 9:00 AM to 4:00 PM.