UPI New Rules 2025: ఫోన్ పే, గూగుల్ పే, పేయ్ టి యమ్ UPI పేమెంట్ యాప్ లు లేదా ఇతర పేమెంట్ యాప్ లు వాడేవారు కొత్తగా వచ్చిన ఈ మార్పులు చేయనున్నారు వాటి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన రోజువారీ డబ్బుకి సంబంధిచిన లావాదేవీ వ్యవహారాలకు ఎక్కువ శాతం వరకు ఈ UPI యాప్ ల మీద ఆధారపడి లావాదేవీలను చేయడం జరుగుతుంది.

అయితే కొన్ని కారణాల దృష్ట్యా ఈ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్పేస్ లో(UPI) లో కొన్ని మార్పులు తీసుకు రావడం జరిగింది. ఈ మార్పులకు కారణం, UPI వ్యవస్థను మరింత స్థిరంగా, భద్రంగా మరియు సమర్థవంతంగా నిర్వహించేందుకు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) 2025 ఆగస్టు 1 నుండి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చే కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
మార్పులకి గల ముఖ్య కారణాలు
కొంతమంది వినియోగదారులు ఈ మార్పులను ఇబ్బందిగా భావించినప్పటికీ వీటివలన కొన్ని ప్రయోజనాలు భవిష్యత్తులో పొందవచ్చు.
- UPI వ్యవస్థలో మెరుగైన స్థిరత్వం
- లావాదేవీల విజయ శాతం పెరగడం
- సర్వర్‌పై భారాన్ని తగ్గించడం
- భద్రత మరియు డేటా సమగ్రత మెరుగవడం
ఈ మార్పుల ద్వారా అన్ని వినియోగదారులకు మెరుగైన అనుభవం లభిస్తుందని, అంతేకాక డిజిటల్ లావాదేవీలపై నమ్మకం మరింత పెరుగుతుందని NPCI ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
ఏ మార్పులు జరిగాయి
ఈ డిజిటల్ పేమెంట్ విధానం లో జరిగిన కొన్ని మార్పుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మార్పు | వివరణ |
---|---|
ఖాతా వివరాల వీక్షణ పరిమితి | ప్రతి యాప్‌లో రోజుకు 25 సార్లు మాత్రమే బ్యాంక్ ఖాతా వివరాలు చూడగలరు. PhonePe + Google Pay కలిపి 50 సార్లు మాత్రమే. |
బ్యాలెన్స్ చెక్ పరిమితి | బ్యాలెన్స్ చెక్ రోజుకు గరిష్ఠంగా 50 సార్లు మాత్రమే. |
లావాదేవీ స్థితి ఆలస్యం | లావాదేవీ స్టేటస్ కన్ఫర్మేషన్‌లో స్వల్ప ఆలస్యం ఉండొచ్చు – ఇది వ్యవస్థ స్థిరత్వం కోసం. |
ఆడిట్ నివేదిక | PSP లు ఆగస్టు 31, 2025 లోపు కొత్త నియమాలకు అనుగుణంగా ఆడిట్ నివేదిక సమర్పించాలి. |
వ్యాపారాలపై ప్రభావం | అధికంగా API వినియోగించే ఫిన్టెక్ కంపెనీలు, పెద్ద విక్రేతలు సేవలలో మార్పులు చేయాల్సి ఉంటుంది. |
ఈ మార్పుల కారణంగా వినియోగదారులు మరింత వేగవంతమైన, ఖచ్చితమైన ఫలితాలను మరియు జాప్యం లేని వేగవంతమైన ట్రాన్సాక్షన్ లను జరిపే అవకాశం ఉంటుంది. ఈ విధానం వలన విఫలమయ్యే ట్రాన్సాక్షన్ ల సంఖ్యను తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
UPI New Rules 2025 – FAQs
From August 1, 2025, users can view bank account details only 25 times per app per day and check balance up to 50 times daily.
NPCI introduced these rules to reduce server overload, prevent misuse, and improve the stability and security of the UPI system.
For most regular users, these changes will have minimal impact. However, high-frequency users like businesses may need to adjust their systems.